ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం
ఎస్పీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్‌రావు, పోలీస్ సిబ్బంది
అనకాపల్లి: ప్లాస్టిక్ రహిత సమాజమే అందరి లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి థీమ్ ‘ప్లాస్టిక్ కాలుష్య నివారణ’పై ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది శ్రమదానం చేసి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతినెలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో కార్యాలయం ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, ఎస్‌ఐలు ప్రసాద్, సురేష్ బాబు, సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


