● కార్యదర్శికి ప్రశంసలు
కార్యదర్శి రాజశేఖర్‌కు ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న కమిషనర్ కృష్ణతేజ
నక్కపల్లి : ఇంటిపన్ను వసూళ్లలో నక్కపల్లి మండలం జిల్లాలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోవడం అభినందనీయమని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. మండలంలో నక్కపల్లి, బుచ్చిరాజుపేట, చినదొడ్డిగల్లు, ఎన్.నర్సాపురం, చందనాడ గ్రామాల్లో మొత్తం రూ.85 లక్షల ఇంటి పన్నులకు ఆయా గ్రామాల క్లస్టర్ కార్యదర్శి రాజశేఖర్ రూ.70 లక్షలు వసూలు చేసి పంచాయతీలకు జమ చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్‌కు కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పంచాయతీల్లో కూడా ఇంటి పన్నులు శతశాతం వసూలు చేయాలని కమిషనర్ కృష్ణతేజ సూచించినట్టు కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.


