నేడు జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
దేవరాపల్లి: స్థానిక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం ఉమామహేశ్వరీ దేవి(దేవీతల్లి) తీర్థ, కల్యాణ మహోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమైన తీర్థ మహోత్సవాల్లో భాగంగా ఉమామహేశ్వరీ దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను భక్తజనం మేళతాళాల, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ శారదానదిలోకి తీసుకెళ్లి త్రిశూల స్నానం చేయించారు. ఆఖరి రోజు భారీగా భక్తజనం హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు హోరా హోరీగా సాగాయి. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆఖరి రోజు సోమవారం జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీలను నిర్వహించి, విజేతలకు రూ. 20 వేలు, రూ. 18 వేలు, రూ. 16 వేలు, రూ. 14 వేలు, రూ. 12 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేలు చొప్పున నగదు బహుమతులను అందించనున్నారు.
నేటితో ముగియనున్న
దేవీతల్లి తీర్థ మహోత్సవాలు
నేడు జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పోటీలు


