కనీస పింఛను పెంపు కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కనీస పింఛను పెంపు కోసం ఆందోళన

Feb 2 2026 7:30 AM | Updated on Feb 2 2026 7:30 AM

కనీస పింఛను పెంపు కోసం ఆందోళన

కనీస పింఛను పెంపు కోసం ఆందోళన

తుమ్మపాల : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇపీఎస్‌95 రిటైర్డ్‌ పెన్షనర్స్‌కు కనీస పెన్షన్‌ రూ.9 వేలు అమలు డిమాండ్‌ చేస్తూ చేపట్టే ఆందోళనను విజయవంతం చేయాలని ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్‌న్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సుధాకరరావు పిలుపునిచ్చారు. మండలంలోని తుమ్మపాల గౌరీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనంలో ఆర్‌ఈసీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగి సిహెచ్‌.రామారావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ పింఛనుతో పాటు భార్యభర్తలకు వైద్యసౌకర్యం కల్పించాలని, సీనియర్‌ సిటిజన్స్‌కు రైల్వే రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 9, 10 తేదీలలో జరిగిన ఢిల్లీలో జరిగిన సెమినార్‌, జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ధర్నా వివరాలు తెలిపారు. ఈ నెల 9న కలెక్టర్‌ కార్యాలయం, 10న రీజనల్‌ ప్రావిడెంటు కార్యాలయం, 11న విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సంఘం సభ్యత్వం అందరూ చేయించుకోవాలని కోరారు. అంతకుముందు అమరులైన సంఘ సభ్యులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శి కె.పి.కుమార్‌, తుమ్మపాల, గోవాడ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీల రిటైర్డ్‌ ఉద్యోగులు, ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement