ఘనంగా ముగిసిన గౌరీపరమేశ్వరుల ఉత్సవం
అనకాపల్లి: గవరపాలెం గౌరీపరమేశ్వరుల అమ్మవారి ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా ముగిసింది. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారుగా 3 లక్షల మంది ప్రజలు శనివారం ఉదయం నుంచి అదివారం తెల్లవారు జాము వరకూ ఉత్స వాన్ని తిలకించారు. గవరపాలెం సంతోషిమాత ఆర్చ్ పక్కన మందుగుండు సీతారామయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బాణసంచాను జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ శనివారం రాత్రి 2 గంటలకు ప్రారంభించారు. ఉత్సవంలో వివిధ రకాలైన స్టేజ్ ప్రోగ్రాంలు, నేలవేషాలు ప్రజలను అలరించాయి. ఉత్సవంలో డీఎస్పీ ఎం.శ్రావణి, పట్టణ, ట్రాఫిక్ సీఐలు ప్రేమ్‌కుమార్, ఎం.వెంకట నారాయణలు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సినీసింగర్స్ పాటలు, రింగ్‌రోడ్డు బెల్లంమార్కెట్ యార్డుల వద్ద ఏర్పాటు చేసి వివిధ రకాలైన పూల డెకొరేషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఘనంగా ముగిసిన గౌరీపరమేశ్వరుల ఉత్సవం


