ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌గా నాయుడు | - | Sakshi
Sakshi News home page

ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌గా నాయుడు

Feb 2 2026 7:30 AM | Updated on Feb 2 2026 7:30 AM

ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌గా నాయుడు

ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌గా నాయుడు

అనకాపల్లి : ప్రభుత్వ ఉద్యోగుల ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌గా ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌ నాయుడు(వాసు)ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శిగా ఎలమంచిలి శ్రీరామ్మూర్తి(బుచ్చియ్య పేట మండలం డీటీ), కోశాధికారిగా కె.వరహాలు(యలమంచిలి తహసీల్దార్‌), అసోసియేట్‌ అధ్యక్షుడుగా కె.సురేష్‌ నాయుడు (కలెక్టరేట్‌ డిప్యూటీ తహసిల్దార్‌) ఉపాధ్యక్షులుగా పి.రమేష్‌, ఎం.ఎస్‌.అరుణ్‌కుమార్‌, సి.వి.చైనులు, ఎం.జయశ్రీ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా జి.వి.రామకృష్ణ ఎన్నికయ్యారు.

స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ కమిటీ...

జిల్లా స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోషియేట్‌ కార్యద ర్శిగా టిహెచ్‌.వినయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, కె.ఎ.ఎన్‌.ఎస్‌.కె.కుమార్‌, జి.వీరవాణి, ఎం.శివ, కోశాధికారిగా కె.వరహాలు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎం.ఆశాజ్యోతి, ఎస్‌.ప్రసాద్‌, పి.వెంకటేష్‌, వై.శివకుమార్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎ.త్రినాథరావు, కార్యదర్శి పి.శ్యామ్‌ప్రసాద్‌, రాష్ట్ర పరిశీలకుడు డి.రాజేంద్రవర్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్‌ వాసు మాట్లాడుతూపై కమిటీ 2029 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement