సీతమ్మా వరాలేవమ్మా | - | Sakshi
Sakshi News home page

సీతమ్మా వరాలేవమ్మా

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

సీతమ్

సీతమ్మా వరాలేవమ్మా

కేంద్ర బడ్జెట్‌లో విశాఖకు మొండిచెయ్యి మెట్రో ఊసు లేదు.. కొత్త ప్రాజెక్టులకు నిధులు లేవు స్టీల్‌ప్లాంట్‌పై కరుణ చూపించని కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ గురించి ప్రస్తావించని బడ్జెట్‌ అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిధుల పంపకాలు సిటీ ఎకనమిక్‌ రీజియన్‌కు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు

ర్షక, పారిశ్రామిక, మధ్య తరగతి వర్గాలను కాస్త ఊరడించేలా.. పద్దు లెక్కలు చదివిన నిర్మలా సీతారామన్‌.. విశాఖను మాత్రం పూర్తిగా విస్మరించారు. డీపీఆర్‌ ఇచ్చినా వైజాగ్‌ మెట్రో ఊసు లేదు. విశాఖ ఉక్కుకు ఊరడింపు లేదు. శంకుస్థాపన జరిగినా రైల్వే జోన్‌ ప్రస్తావన లేదు. అంతెందుకు విశాఖ పేరు కూడా బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం జిల్లా ప్రజల్ని విస్మయానికి గురిచేసింది. కేవలం ఉద్యోగుల్ని ఊరడిస్తూ.. పన్ను చెల్లింపుదారుల్ని పలకరిస్తూ.. రైతులకు కాస్త భరోసా ఇస్తూ.. నగరాల అభివృద్ధికి కొంచెం పెద్దపీట వేస్తూ సాగిన సుదీర్ఘ ప్రసంగం వల్ల విశాఖకు ఒనగూరే ప్రయోజనాలేవీ అంత గొప్పగా లేవంటూ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌కు అరకొర కేటాయింపులు, అన్ని పోర్టులతో పాటు విశాఖపట్నం పోర్టుకు విదిలింపులు తప్ప.. చెప్పుకోదగ్గ నిధుల మంజూరు నిర్మలమ్మ పద్దులో కనిపించలేదు.

ఉత్తరాంధ్రకుఅన్యాయం...

కేంద్ర బడ్జెట్‌తో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నిధులు తగ్గించారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదింపు జరిగింది. ఇదే జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీరు లేనట్లే. ఆనాడు వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందించాలనే 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉండాలని నిర్ణయించారు. దాన్ని తగ్గిస్తే..ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసినట్టే. పోలవరం లెప్ట్‌ కెనాల్‌కు అర్థం లేనట్లే. రూ.3,320 కోట్ల కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఇక రాష్ట్ర విభజన చట్టంలో అంశాలను, ప్రత్యేక హోదా ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్‌, విశాఖలో మెట్రో రైలు ప్రకటనే లేదు.

–గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి

సీతమ్మా వరాలేవమ్మా1
1/2

సీతమ్మా వరాలేవమ్మా

సీతమ్మా వరాలేవమ్మా2
2/2

సీతమ్మా వరాలేవమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement