స్టీల్‌ప్లాంట్‌కు అదనపు నిధులేవి.?
విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయాన్ని బడ్జెట్‌లో సీతారామన్ ప్రస్తావించకపోవడం అత్యంత దారుణం. ఓవైపు ప్రైవేటీకరణ అంటూ మరోవైపు.. చెయ్యడం లేదని చెబుతున్నారు. ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఈ బడ్జెట్‌లో ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని పునరుద్ధరిస్తారని అనుకున్నాం. కానీ.. మొండిచెయ్యి చూపించారు. అదనపు నిధులు కేటాయించకుండా విస్మరించడంపై ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేతన జీవులకు నిరాశ కల్పించేలా బడ్జెట్ ఉంది.
–మంత్రి రాజశేఖర్, ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి


