స్టీల్‌ప్లాంట్‌ని మర్చిపోయారా.?
కేంద్ర బడ్జెట్ ‘వికసిత్ భారత్’ అని గొప్పలు చెప్పడానికే పరిమితమైంది. ఆచరణలో విశాఖకు తీరని అన్యాయం చేసింది. విద్య, నైపుణ్యాభివృద్ధికి 2 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడం దారుణం. ప్రభుత్వ విద్యను కాదని ‘గీతం’ వంటి ప్రైవేట్ వర్సిటీలకు గ్రాంట్లు ఇవ్వడం సరికాదు. రైల్వే జోన్ నిధులు, స్టీల్ ప్లాంట్ మనుగడపై స్పష్టత లేకపోవడంతో పాటు.. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, చైన్నెలకు కొత్త రైళ్ల డిమాండ్‌ను పట్టించుకోలేదు. మొత్తంగా ఈ బడ్జెట్‌లో వైజాగ్ ఊసే లేదు.
–జేవీ సత్యనారాయణమూర్తి,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు


