గాల్లోనే మెట్రో.. సందిగ్ధంలో జోన్.!
IIలో
● మాఘ పౌర్ణమి స్నానాలకు పోటెత్తిన జనం
● రేవుపోలవరం కిటకిట
● తీరంలో లక్ష్మీమాధవస్వామిని దర్శించుకున్న భక్తులు
విశాల విశాఖ నగరానికి మెట్రో కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీపీఆర్‌ని 2024 జనవరిలో కేంద్రానికి పంపించింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త డీపీఆర్‌ని కూడా సిద్ధం చేసి పంపించింది. మెట్రో ప్రాజెక్టు నిర్మించేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొడుతూ నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది. అవన్నీ కాగితాలకే పరిమితమంటూ కేంద్ర బడ్జెట్ సుస్పష్టం చేసేసింది. ఎందుకంటే.. వైజాగ్ మెట్రోకి ఒక్క రూపాయి కూడా విదిలించకపోవడం అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న విషయం.. బడ్జెట్ ప్రసంగంలో స్పష్టమైందని అన్ని వర్గాలూ పెదవి విరుస్తున్నాయి. మరోవైపు పనులు ప్రారంభమైనా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు ముందుకెలా వెళ్తాయంటూ రైల్వే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తీరం.. జనసంద్రం
ఎస్.రాయవరం : మాఘపౌర్ణమిస్నానాలకు రేవుపోలవరం తీరంలో పోటెత్తిన భక్తజనం
ఎస్.రాయవరం : మాఘపౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం రేవుపోలవరం తీరం భక్తులతో కిటకిట లాడింది. గడిచిన ఏడాదితో పోలిస్తే 10 శాతం భక్తులు అధనంగా లక్షకు పైగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువ జామునుంచి భక్తులు స్నానాలు ప్రారంభించినప్పటికీ ఉదయం 9 గంటలనుంచి భక్తులు రద్దీ బాగా పెరిగింది మధ్యాహ్నం 12 గంటల వరకు రేవుపోలవరం, కొత్తరేవుపోలవరం దారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తీరంలో సముద్ర కెరటాలు జన కెరటాలుగా మారాయి. ఈ రద్దీ సమయంలో పోలీస్ బందోబస్తు కూడా రద్దీ క్రమబద్దీకరించేందుకు ఉక్కిరిబిక్కిరి ఆయ్యారు. ఆ సమయంలో వీఐపీ పాస్‌లు వాహనాలు సైతం సమీపంలో ప్రదేశాలు పార్కింగ్ చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున తీరానికి చేరుకుని పుణ్య స్నానమాచరించిన భక్తులు సమీపంలో ఆలయంలో ఉన్న లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్నారు. ఈ భక్తులను అడ్డురోడ్డు రేవుపోలవరం తీరం వరకు చేర్చేందుకు ఆర్టీసీ శాఖ ప్రత్యేక బస్సులు నడిపింది. నర్సీపట్నం డీఎస్సీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. మాఘపౌర్ణమి సంప్రదాయాలు ఆచరణలో భాగంగా పలువురు యాదవ సంఘ నాయకులు తోడుపెద్దులాటలు నిర్వహించారు. సముద్రంలో పుణ్య స్నానమాచరించే దంపతులు బ్రహ్మముడులు వేయుంచుకుని పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు మజ్జిగ, పంపిణీ చేశారు. ఆలయంలోనికివెళ్లే భక్తులు వస్తువులు ఉచితంగా భద్రపరచే విధంగా ఏర్పాట్లు చేశారు. రేవుపోలవరం నుంచి అడ్డురోడ్డు వరకు సేవా సంఘ సభ్యులు , వర్తక సంఘం, వాణిజ్య సముదాయాలవారు మజ్జిగ, తాగునీరు, అల్పహారాలు పంపిణీ చేశారు. పెనుగొల్లు, ఎస్.రాయవరం పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. రెవెన్యూ, పంచాయరాజ్ సిబ్బంది సేవలందించారు. గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. స్నానమాచరించే భక్తులను కెరటాల లోపలకు వెళ్లకుండా అదుపు చేశారు. ఇక సముద్ర స్నానమనేసరికి యువత పిరమిడ్ విన్యాసాలు, ఇసుక గూళ్లు కట్టుకుని సందడి చేశారు.
పోటెత్తిన పూడిమడక
గాల్లోనే మెట్రో.. సందిగ్ధంలో జోన్.!
గాల్లోనే మెట్రో.. సందిగ్ధంలో జోన్.!
గాల్లోనే మెట్రో.. సందిగ్ధంలో జోన్.!
గాల్లోనే మెట్రో.. సందిగ్ధంలో జోన్.!


