హామీలకు నామాలు.. ‘ఉత్సవ్‌’కు బాజాలు | - | Sakshi
Sakshi News home page

హామీలకు నామాలు.. ‘ఉత్సవ్‌’కు బాజాలు

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

హామీలకు నామాలు.. ‘ఉత్సవ్‌’కు బాజాలు

హామీలకు నామాలు.. ‘ఉత్సవ్‌’కు బాజాలు

అనకాపల్లి : చంద్రబాబు ప్రభుత్వం సుమారు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు సూపర్‌సిక్స్‌ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లా రైతులకు పెద్ద గిఫ్ట్‌గా గోవాడ చక్కెర కర్మాగారాన్ని మూసివేయడం జరిగిందని, దీని నుంచి అన్నివర్గా ల ప్రజల దృష్టి మల్చడానికి అనకాపల్లి ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ అన్నా రు. స్థానిక గాంధీనగరంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రారంభించే ముందు చక్కెర కర్మాగారంలో రైతుల బకాయిలు రూ.33 కోట్లు చెరకును తీసుకుని నేటి వరకూ నగదు చెల్లించలేదని అన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు పూర్తిస్థాయిలో బెల్లం లేక నిర్వీ ర్యం అయిపోతుందన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం అనకాపల్లి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని, దీనివల్ల ప్రజలకు ఓరిగేది ఏమిలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో కోడిపందాలు, గుళ్లాటలు, జూ దం, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌లు, ఇసుక దోపిడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

సూపర్‌సిక్స్‌ అమలు ఎక్కడ

ఆరోగ్యశ్రీ పథకం ఉన్నాట్టా...లేనట్టా...?

విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఏదీ....

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌

సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement