కేజీహెచ్‌లో ‘పెయిన్‌ క్లినిక్‌’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో ‘పెయిన్‌ క్లినిక్‌’ ప్రారంభం

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

కేజీహెచ్‌లో ‘పెయిన్‌ క్లినిక్‌’ ప్రారంభం

కేజీహెచ్‌లో ‘పెయిన్‌ క్లినిక్‌’ ప్రారంభం

డాబాగార్డెన్స్‌: రాష్ట్రంలోనే మొట్టమొదటి పెయిన్‌ క్లినిక్‌ను విశాఖ కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి(కేజీహెచ్‌)లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక క్యాన్సర్‌ నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఈ క్లినిక్‌ సేవలు ఊరటనిస్తాయన్నారు. ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ నార్త్‌ అమెరికా అలుమ్ని ఈ క్లినిక్‌ ఏర్పాటు కోసం రూ.కోటి విరాళం అందించడంపై మంత్రి అభినందనలు తెలిపారు. ఇటీవల గుంటూరులో 600 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటులోనూ, విశాఖ, కాకినాడ ప్రభుత్వ వైద్య సంస్థల అభివృద్ధిలోనూ పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement