వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ చించివేత
ఎస్.రాయవరం: రేవుపోలవరం మాఘపౌర్ణమి జాతరలో వైఎస్సార్‌సీపీ నాయకులు భక్తులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఇది గమనించిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్, స్థానిక నాయకుడు చేపల రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్‌ఐ విభీషణరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను పట్టుకుని కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సిద్ధమైన పార్టీ నాయకులు వెనక్కు తగ్గారు.


