దేవదాయ భూముల్లో సరుగుడు నరికివేతకు వీల్లేదు
● దేవదాయ శాఖ అనకాపల్లి గ్రూపు ఈవో మురళీకృష్ణ
దేవరాపల్లి: మండలంలోని మారేపల్లిలో దేవదాయ భూములపై కోర్టు వివాదం తేలేంత వరకు సరుగుడు తోట నరికివేతకు వీల్లేదని ఆ శాఖ అనకాపల్లి ఈవో బి. మురళీకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన దేవరాపల్లిలో మాట్లాడారు. మారేపల్లిలో సర్వే నెంబర్ 115లో 23.15 ఎకరాల దేవాదాయ భూమిలో సరుగుడు తోటను నరికి వేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో పరిశీలించారు. దీనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశామన్నారు. కోర్టు నుంచి లేదా దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు సదరు భూముల్లో ఎటువంటి మొక్కలు, ఇతర ఫలసాయాన్ని తీయడానికి వీల్లేదని శ్రీకవిత అగ్రో ఫామ్స్ అధినేత డి. వెంకటఅప్పారావుకు సూచించినట్లు తెలిపారు.


