22న రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

22న రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌

Mar 11 2026 7:39 AM | Updated on Mar 11 2026 7:39 AM

టోర్నమెంట్‌ గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న జీవన్‌రాయ తదితరులు

మాకవరపాలెం: మండలంలోని తామరం ఇమ్మానుయేలు ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లో ఈ నెల 22న రాష్ట్ర స్థాయి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు ప్రగతి చెస్‌ అకాడమీ నిర్వాహకుడు సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ గోడపత్రికలను మంగళవారం ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్‌ బిషప్‌ కె.జీవన్‌రాయ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పాల్గొనేవారు ఈ నెల 20లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా పాల్గొనవచ్చని, విజేతలుగా నిలిచిన 30 మందికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు 9949048153, 9676514520 నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement