చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌గా డీఎల్‌పురం | - | Sakshi
Sakshi News home page

చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌గా డీఎల్‌పురం

Mar 11 2026 7:39 AM | Updated on Mar 11 2026 7:39 AM

● జాతీయ పురస్కారానికి ఎంపిక ● గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం

నక్కపల్లి : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి మండలంలో డీఎల్‌పురం ఎంపికై ంది. చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌గా ఈ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఎంపీడీవో చైతన్య తెలిపారు. మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్‌శాఖకు చెందిన అధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు చేసింది. పురస్కారానికి ఎంపికయ్యేందుకు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించింది. ప్రధానంగా గ్రామంలో పిల్లల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి తీసుకుంటున్న సేవలు, చర్యల గురించి తెలుసుకున్నారు. చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌ పురస్కారం కోసం ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, దీనికనుగుణంగానే ఈ గ్రామంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందంలో మలైపాల్‌, సిపిఆర్‌ ఓఎస్‌డీ శ్రీనాద్‌రెడ్డి, ఏపీఎన్‌ఐఆర్‌డీ నుంచి నాగరాజు, డీపీవో సందీప్‌, డీఎల్‌పీవో నారాయణ మూర్తి, డీడీవో నాగలక్ష్మి, ఎంపీడీవో చైతన్య, ఏవో సీతారామరాజు, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement