‘స్పెల్‌బీ’ విజేతకు అభినందనలు
స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ చూపిన
విద్యార్థి లోకేష్‌ను అభినందిస్తున్న దృశ్యం
ఎస్.రాయవరం: మండలంలోని కోరుప్రోలు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం.లోకేష్ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి స్పెల్‌బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి, డివిజన్ స్థాయికి ఎంపికై నట్టు హెచ్‌ఎం కప్పల ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలను శుక్రవారం సందర్శించిన డిప్యూటీ డీఈవో విద్యార్థి లోకేష్‌ను అభినందించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మరింత శిక్షణ ఇవ్వాలని సూచించారు.


