16న రామగిరి తీర్థం
మునగపాక: మండలంలోని రామగిరిలోని శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి తీర్థం ఈ నెల 16న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కనుమ పండగ రోజున తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి పలు సేవగరిడీల ప్రదర్శన అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తీర్ఖం తిలకించేందుకు సమీపంలోని చూచుకొండ, జగన్నాథపురం, గణపర్తి, మెలిపాక, చెర్లోపాలెం, మడకపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారామచంద్రమూర్తిని దర్శించుకుంటారు. తీర్థం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహణపై ఎస్‌ఐ పి.ప్రసాదరావు ఏర్పాట్లు చేస్తున్నారు.
16న రామగిరి తీర్థం


