గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం
కశింకోట వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి, రంగనాథస్వామిల ఉత్సవ విగ్రహాలు , (ఇన్‌సెట్)
ద్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో..
కశింకోట: గోదాదేవి (ఆండాలమ్మ) కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా దేవదాయ శాఖకు చెందిన స్థానిక రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు సంప్రదాయంగా, శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్ననట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రేజేటి శ్రీరామాచార్యులు, అర్చకులు సీతారామాచార్యులు, మారుతి తెలిపారు. స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ గోదాదేవి కల్యాణాన్ని నిర్వహిస్తామని అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు తెలిపారు. గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేశారు.
గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం


