జగన్ మళ్లీ సీఎం కావాలని...
ఎస్.రాయవరం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పమాలాధారణ భక్తులు ఎరిపల్లి జగన్నాథం, మణి వేడుకున్నారు. మండలంలోని కొత్త రేవుపోలవరం గ్రామానికి చెందిన వీరువురు జగనన్న ఫ్లెక్సీ పట్టుకుని శమరిమలై కొండ ఎక్కారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కంబాల జోగులు అత్యధిక మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నట్టు వారు చెప్పారు. పార్టీ కార్యకర్తలు భగవంతుని సన్నిధికి వెళ్లడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.


