అశ్వవాహనంపై తిరువీధి సేవలు
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న దృశ్యం
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి అశ్వవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు నిత్యార్చనలు అభిషేకాలు పూర్తి చేశారు. కొండ దిగువన ఉత్సవమూర్తుల సన్నిధిలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం సాత్‌మురై వంటి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామిని అశ్వవాహనంపై, పల్లకిలో గోదాదేవి అమ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై ఇరవై పాశురాన్ని విన్నపం చేశారు. తరువాత ప్రసాద నివేదన, తీర్దగోష్టి ,ప్రసాద వినియోగం జరిగాయి. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామివారితో ద్రవిడ వేద ప్రబంధం కార్యక్రమం జరిగింది. రాత్రి స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు.


