రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి
అచ్యుతాపురం రూరల్: గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంతాడ లోహిత్‌కుమార్ మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పూడిమడకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో ఈరిగిల వివేక్ మృతి చెందడం పాఠకులకు విదితమే. ఇటీవల పదో తరగతిలో 565 మార్కులతో పాసైన విద్యార్థి లోహిత్‌కుమార్ రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో అతడి కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రూ.10 లక్షలపైన అప్పులు చేసి ఖర్చు పెట్టి నెల రోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదు. దాంతో చేతికందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పూడిమడకలో విషాద ఛాయలు


