ఏజెన్సీకి సాయంత్రం బస్సులు రద్దు
నర్సీపట్నం: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు సాయంత్రం వెళ్లే బస్సులను రద్దు చేశామని డిపో మేనేజర్ ధీరజ్ తెలిపా రు. అల్లూరి జిల్లాకు సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. పోలీసుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లే నైట్ హాల్ట్ బస్సులతోపాటు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మీదుగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ నైట్ సర్వీసు రద్దు చేశామన్నారు. పరిస్థితులు చక్కబడిన తరువాత పోలీసుల ఆదేశాల మేరకు బస్సులను తిప్పుతామని మేనేజర్ తెలిపారు.


