దళితులకు రక్షణ లేదు
దాడి జరిగి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణం. మంత్రి నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేదు. అగ్రవర్ణాల వారు దళితులపై దాడి చేశారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రతి విషయంలో బాధితులు మాత్రం దళితులే. దాడులు, అత్యాచారాలు దళితులపైనే జరుగుతున్నాయి. డొంకాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉంది. తక్షణమే 14 మంది నిందితులను అరెస్టు చేయాలి.
– సోనీ వుడ్, నాసా సంస్థ డైరెక్టర్
దాడి చేయడం దారుణం
సెల్‌ఫోన్ దొంగిలిస్తే కేసు పెట్టి శిక్షించాలి. కానీ దుర్మార్గంగా కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేయడం దారుణం. ఫిర్యాదు చేస్తే బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం తగదు. దాడి చేసింది టీడీపీకి చెందిన వారు కావడంతో మంత్రి అనిత అగ్రవర్ణాల వారికి సపోర్టు చేస్తున్నారని భావిస్తున్నాం. నిందితులను అరెస్టు చేయించకుండా రాజీ చేస్తామని చెప్పడం శోచనీయం. డీఎస్పీ విచారణ పారదర్శకంగా లేదు. ముందు అరెస్టు.. తర్వాతే రాజీ చర్యలు.
– జె.వి.ప్రభాకర్, డీహెచ్‌పీఎస్ నేత
దళితులకు రక్షణ లేదు


