
తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’
కొమ్మాది: సాగర తీర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రుషికొండ బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐ పి.మనోజ్ కుమార్ తీర ప్రాంతాల అప్రమత్తతపై మత్స్యకారులకు, పర్యాటకులకు వివరించారు. తీర ప్రాంతాల వెంబడి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఎలా ఎదుర్కొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, గూఢచారి వ్యవస్థలను ఎలా కనుగొనాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
డీఐజీ పర్యటన
సాగర్‌కవచ్‌లో భాగంగా రుషికొండ బీచ్‌లో బుధవారం రాత్రి మైరెన్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పర్యటించారు. ఇక్కడ బీచ్‌లోని పర్యాటకులతో కాసేపు మాట్లాడి, మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు మురళీకృష్ణ, పి. మనోజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.