ముషిడిపల్లి నుంచి జంక్షన్‌కు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి దాడులు చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేసి బంగారు నగలు, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. పట్ట పగలే ఇలా దాడులు చేయడంతో జంక్షన్‌కు వెళ్లాలంటే మహిళలంతా భయాందోళనలు చెందుతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. పోలీస్‌లు స్పందించి అటువంటి వ్యక్తులపై నిఘా ఉంచి అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి.
–పిల్లి పద్మ, మహిళ, ముషిడిపల్లి.
ఒంటరిగా వెళ్లొద్దని చెప్పాను...
ముషిడిపల్లి జంక్షన్‌కు వెళ్లే మార్గంలో చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తునట్లు మా దృష్టికి వచ్చింది. ఈ దాడుల విషయమై ఐదుగురు తనకు సమాచారం అందించారు. ముషిడిపల్లి మీదుగా ప్రయాణించే ఎ.కొత్తపల్లి వాసులను కూడా అడ్డగించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని దేవరాపల్లి ఎస్‌ఐ గారి దృష్టికి తీసుకెళ్లాను. కానిస్టేబుల్స్‌ను పంపించారు. ఒంటరిగా వెళ్లోద్దని గ్రామస్తులకు తెలియజేశాను. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలకు కూడా తెలియజేశాను.
–లావణ్య, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి, ముషిడిపల్లి.
దొంగల పనిపడతాం
ముషిడిపల్లిలో రాకపోకలు సాగించే వారిని అడ్డగించి దోపిడికి యత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. స్థానిక గ్రామ సచివాలయ సంరక్షణ కార్యదర్శి కూడా మా దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక నిఘా పెట్టి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆచూకీ లభించడం లేదు. మరింత నిఘా పెట్టి అటువంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తాం.
–టి.మల్లేశ్వరరావు, ఎస్‌ఐ, దేవరాపల్లి
ముసుగుదొంగలను పట్టుకోవాలి..
ముసుగుదొంగలను పట్టుకోవాలి..