నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు వెంకన్న, నరసింహమూర్తితో ఆదివాసీ గిరి రైతులు
మాడుగుల : మైదాన ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములుకు పట్టాలివ్వాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న అన్నారు. శనివారం శంకరం పంచాయితీలో కృష్ణంపాలెం, బొడ్డరేవు, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, వెలగలపాడు గిరిజన గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర నిర్వహించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొంత మంది గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా సరే వాటిలో పేర్లు తప్పుగా నమోదు జరిగిందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి గిరిజనుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి, సీపీఎం సభ్యురా లు, కార్లి భవానీ, రైతులు పాల్గొన్నారు.