కశింకోట: నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా ప్రోహిబిషన్ చట్టం–1995 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జోన్ ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీరామచంద్రమూర్తి హెచ్చరించారు. మండలంలోని ఉగ్గినపాలెంలో నవోదయం–2.0 కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామసభ నిర్వహించి కళా జాతర ద్వారా నాటు సారాకు వ్యతిరేకంగా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీని నాటు సారా రహితంగా తయారు చేసేందుకు ప్రారంభించిన నవోదయం–2.0 కార్యక్రమం విజయవంతం కావడానికి అంతా సహకరించాలన్నారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదులను 14405 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి. సుధీర్, సీఐ వై.లక్ష్మన్నాయుడు, కశింకోట ఎస్‌ఐ మనోజ్‌కుమార్, ఎకై ్సజ్ ఎస్‌ఐ గణేష్, సర్పంచ్ కలగా గున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.