24న ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌ | Sakshi
Sakshi News home page

24న ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌

Published Tue, May 21 2024 10:15 AM

-

గోపాలపట్నం (విశాఖ): ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్‌ఎంఈ మేక్‌ ఇన్‌ ఇండియా సపోర్టు స్టార్టప్‌ అండ్‌ అగ్రిటెక్‌, ఆక్వా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్టు ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ దాసరి దేవరాజ్‌, డీజీఎస్‌ సంతోష్‌కుమార్‌ సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో ఈ వర్క్‌షాప్‌ జరుగుతుందని పేర్కొన్నారు. సపోర్టింగ్‌ హ్యాండ్‌ హోల్డింగ్‌ గైడెన్స్‌, రూ.5 కోట్ల వరకూ రుణ సదుపాయం పొందడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23వ తేదీలోగా పెందుర్తి ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 98667 93111, 99630 45222 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement