పొత్తు పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

పొత్తు పంచాయితీ

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

కొయ్యూరు జెడ్పీటీసీ సీటుపై కూటమి పార్టీల కన్ను పడింది.. పొత్తు ధర్మంలో భాగంగా తమకు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా, టీడీపీలోనూ ఆశావహులు పెద్ద సంఖ్యలో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంపీటీసీ స్థానాల కోసం జనసేన సైతం పట్టుబడుతుండటంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అధిష్టానం బీ–ఫారాలు ఎవరికి కేటాయిస్తుందన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది.

కొయ్యూరు: కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొయ్యూరులో రాజకీయ వేడిని పెంచుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా జెడ్పీటీసీ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబడుతుండటంతో టీడీపీలోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జెడ్పీటీసీ స్థానం చొప్పున కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యూరు జడ్పీటీసీ స్థానంపై ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

టీడీపీలోనూ ఆశావహులు..

మరోవైపు, టీడీపీలోనూ జెడ్పీటీసీ టికెట్‌ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఈ స్థానం మహిళలకు కేటాయించిన నేపథ్యంలో పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. దివంగత చింతపల్లి ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ఎంవీఎస్‌ ప్రసాద్‌ తన సోదరిని జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, టీడీపీ నుంచి మరికొందరు నేతలు కూడా టికెట్‌ ఆశిస్తుండటంతో బీ–ఫారం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎంపీటీసీ స్థానాలకు..

ఇదిలా ఉండగా, ఎంపీటీసీ స్థానాల విషయంలోనూ కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంటోంది. తమకు ఎంపీటీసీ స్థానాలు కేటాయించాలని జనసేన నేతలు ఒత్తిడి తెస్తుండగా, జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ స్థానాల్లోనూ వాటా ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. దీంతో కొయ్యూరులో సీట్ల సర్దుబాటు చర్చలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. చివరకు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? జెడ్పీటీసీ టికెట్‌ ఎవరిని వరిస్తుంది? అన్నది అధిష్టానాల నిర్ణయాలపై ఆధారపడి ఉంది.

కొయ్యూరులో జెడ్పీటీసీ సీటుపై ఉత్కంఠ!

బీజేపీ డిమాండ్‌తో టీడీపీలోఆశావహుల ఆందోళన

జనసేన నుంచి ఎంపీటీసీ స్థానాలపై ఒత్తిడి

ఆసక్తికరంగా రాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement