సాక్షి, పాడేరు: జిల్లా లో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నా ప్రభుత్వ పథకాల ప్రచార ప్లెక్సీలు, బోర్డులు తొలగించకపోవడంపై విమర్శ లు వ్యక్తమవుతున్నా యి. పాడేరు ఐటీడీఏ, కలెక్టరేట్ రహదారిలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం, ఏపీఆర్ కళాశాల, కలెక్టరేట్ ఎదుట సీఎం చంద్రబాబు, మంత్రి సంధ్యారాణి, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన ప్రచార బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లకు కట్టిన టీడీపీ జెండాలూ తొలగించలేదు. ఎన్నికల అధికారులు వీటిని పట్టించుకోకపోవడంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు ఆక్షేపిస్తున్నారు.


