ఇంటికి చేరాల్సిన వేళ.. కానరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరాల్సిన వేళ.. కానరాని లోకాలకు

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

● జేసీబీ తొండం తగిలి ఒకరి మృతి

● మరొకరికి తీవ్ర గాయాలు

మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పాడేరు–జి.మాడుగుల జాతీయ రహదారిపై జేసీబీ తొండం తగిలి చింతపల్లి మండలం పెద్దబరడకు చెందిన లింగమూర్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

జి.మాడుగుల: పాడేరు–జి.మాడుగుల జాతీయ రహదారిపై జరుగుతున్న పనుల వద్ద శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనులు చేపడుతున్న జేసీబీ ముందుభాగం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తగలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం పెద్దబరడ గ్రామానికి చెందిన ఎస్‌.లింగమూర్తి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. కె.కోడాపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే అక్కడ రహదారి పనులు చేపడుతున్న జేసీబీ తొండం ద్విచక్ర వాహనానికి తగిలింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే లింగమూర్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన మరో వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ప్రాంతంలో జాతీయ రహదారి అధికారులు హెచ్చరిక బోర్డులు, రక్షణ సూచికలు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement