సాక్షి, పాడేరు: గిరి కై లాస క్షేత్రంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్న విజయదశమి దుర్గా నవరాత్రుల ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. కామాక్షి సోమనాథ ట్రేడర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ టి. నరసింగరావు, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొమ్మోజు వెంకటరమణ, మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు తదితరులు విడుదల చేశారు.అర్చకుడు రామం, కమిటీ ప్రతినిధులు బి. ధర్మారావు, కొట్టగుళ్లి రామారావు, కూడా సురేశ్‌కుమార్, సల్లా రామకృష్ణ, వెయ్యాకుల సత్యనారాయణ, కిముడు ప్రభాకర్, యాదగిరి శ్రీను, జ్యోతి, వైదేహి పాల్గొన్నారు.


