పాయకరావుపేట: సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి యోగా పోటీల్లో శ్రీప్రకాష్ విద్యార్థులు ప్రతిభ చాటారు. హర్యానాలోని కర్నాల్‌లో గత నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన పోటీల్లో గ్రూప్ యోగా విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రజిత పతకాలు కై వసం చేసుకున్నారు. గ్రూప్ యోగా విభాగంలో బండారు దేవాన్ష్, పినపాత్రుని సోహ న్‌శ్రీ, చింతకాయల జయదీప్, చింతా రక్షిత్, కాలిబోయిన వెంకట్ పాల్గొన్నారు. వారి సమన్వయం, నైపుణ్యం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. విజేతలను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, యోగాగురువులు సురేష్, జయంతి, ఉపాధ్యాయులు అభినందించారు.


