రీజనల్‌ గేమ్స్‌లో మెరిసిన విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

రీజనల్‌ గేమ్స్‌లో మెరిసిన విద్యార్థిని

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

● అండర్‌ 14 విభాగంలో 9 పతకాలు ● స్కేటింగ్‌, అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

కోటవురట్ల : గ్రామీణ క్రీడాకారులు అద్భుత ప్రతిభతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. మండలంలోని కె.బి.అగ్రహారం గ్రామానికి చెందిన లాలం లెహ్యాశ్రీ అండర్‌ 14 విభాగంలో బహుముఖ ప్రజ్ఞతో పతకాల పంట పండించింది. విభిన్న క్రీడలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌(సీఐఎస్‌సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రీజనల్‌ గేమ్స్‌, స్పోర్ట్స్‌లో 9 పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న లాలం లెహ్యాశ్రీ స్కేటింగ్‌, అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. రీజనల్‌ గేమ్స్‌లో రోలర్‌ స్కేటింగ్‌లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, అథ్లెటిక్స్‌లో 3 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. దీంతో అక్టోబర్‌ 7 నుంచి 9 వరకు ముంబై, ఠాణే, మహారాష్ట్ర జరిగే జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌, అక్టోబర్‌ 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొననుంది. ఈ సందర్భంగా లెహ్యాశ్రీ మాట్లాడుతూ భవిష్యత్‌లో భారత ఒలింపిక్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించి మన దేశానికి స్వర్ణ పతకం అందించమే జీవిత లక్ష్యంగా పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ మార్గదర్శకత్వం తన విజయాలకు కారణంగా తెలిపింది. జాతీయ స్థాయి పోటీలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కీర్తిని తీసుకొచ్చేలా స్వర్ణ పతకాలను సాధించాలని కె.బి.అగ్రహారం గ్రామస్తులు, మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement