సీఎం చంద్రబాబుగన్నెల పర్యటన రేపు | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుగన్నెల పర్యటన రేపు

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెల ప్రాంతంలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ టి. నిశాంతి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గన్నెల ప్రాంతంలో ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శనివారం ఉదయం హెలికాప్టర్‌లో సీఎం గన్నెలకు చేరుకుంటారని చెప్పారు. ఆ తరువాత ఆర్‌.కె.నగర్‌ గ్రామాన్ని సందర్శించి ‘సంజీవని’కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం గన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని వివిధ విభాగాల స్టాళ్లను సందర్శిస్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement