‘ఓపెన్‌’లో 10వ తరగతి అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’లో 10వ తరగతి అడ్మిషన్లు

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

అనంతగిరి(డుంబ్రిగుడ): మండల కేంద్రం అనంతగిరిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా కేంద్రం ద్వారా ఓఎస్‌ఎస్‌సీ 10వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల పదవ తరగతి వరకు చదువుకోలేకపోయిన, 15 సంవత్సరాల వయసు పైబడిన వారు దూర విద్యా విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ను పూర్తి చేసుకునే సదవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం కల్పిస్తోందని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఓఎస్‌ఎస్‌సీ 10వ తరగతి అడ్మిషన్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి కార్యాలయంలో గానీ, ఫోన్‌ నంబర్‌ 6305971317 లో గానీ సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement