తుమ్మపాల: ప్రతిష్టాత్మక అంతర్జాతీ య డ్రాగన్ బోట్ పోటీలకు అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంకు చెందిన కానిస్టేబుల్ సూరినాయుడు ఎంపికయ్యారు. చైనా లోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్న 2026 ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు భారత కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ అందినట్టు సూరినాయుడు తెలిపారు. సెప్టెంబర్ 28న భారత బృందం చైనాకు బయలుదేరి, అక్టోబర్ 4న తిరిగి వస్తుంది. సూరినాయుడు ప్రస్తుతం డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సూరినాయుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై పోలీసు అధికారులు, సహచరులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


