జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి

జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

సాక్షి,పాడేరు: జిల్లాలో జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జనగణన సర్వే బృందాల అధికారులు, సిబ్బందికి శనివారం నిర్వహిస్తున్న రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు ఓ సారి జరిగే అతిపెద్ద సామాజిక సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ కేటాయింపులు, నియోజకవర్గాల పునర్విభజన, విద్యా,ఉపాఽధి ప్రణాళికలకు ప్రాథమిక డేటా అందిస్తుందన్నారు. 33 ఆంశాలపై ఎన్యుమేటర్లంతా ఇంటింటా తిరిగి ఆయా కుటుంబాల సమాచారం సేకరిస్తారన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్వో అంబేద్కర్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసాద్‌, డీపీవో చంద్రశేఖర్‌, డీఈవో రామకృష్ణారావు, ఇన్‌చార్జి డీఎఫ్‌వో ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement