గిరిజనులంటే జగన్‌కు ప్రత్యేక అభిమానం
అరకులోయ టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనులంటే ప్రత్యేక అభిమానం అని పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య వివాహ వేడుకకు వచ్చే నెల 4వ తేదీ బుధవారం ఆయన అరకులోయ రానున్నారు. ఈ సందర్భంగా శనివారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగం మత్స్యలింగం అధ్యక్షతన ఆరు మండలాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన 15 ఏళ్లలో గిరిజన ప్రాంతంలో ఒక శుభకార్యానికి జగనన్న రావడం ఇదే మొదటిసారి అని, అందుకే ఆ రోజు ఉదయం 9.30 గంటలకే కార్యకర్తలందరూ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం హెలీప్యాడ్, వివాహ వేడుక ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై ఎస్‌ఐ గోపాలరావుకు పలు సూచనలు చేశారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏరువాక సత్యారావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి దేవి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖజిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నర్సింహమూర్తి, అనంతగిరి ఎంపీపీ టి.మిథుల, ఆరు మందలాల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, సూర్యానారాయణ, అనిల్, చంద్రుబాబు, పద్మారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు పల్లాసింగి విజయ్‌కుమార్. జి.ప్రకాష్, ఆరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
4న అరకు ఎమ్మెల్యే కుమారుడు
చాణక్య వివాహానికి హాజరు
ఘన స్వాగతం పలకాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గుడివాడ అమర్‌నాథ్ పిలుపు
హెలీప్యాడ్, వివాహ వేడుక ప్రాంతాల పరిశీలన
భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు


