పుచ్చకాయలకు భలే గిరాకీ! | - | Sakshi
Sakshi News home page

పుచ్చకాయలకు భలే గిరాకీ!

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

పుచ్చకాయలకు భలే గిరాకీ!

పుచ్చకాయలకు భలే గిరాకీ!

హాట్‌ కేకుల్లా కొనుగోలు

ముంచంగిపుట్టు: వేసవి కాలం ప్రారంభం కావడంతో ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో పుచ్చకాయలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సంతకు వచ్చిన ప్రజలు పుచ్చకాయల కొనుగోలుకు ఎగబడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని నందపూరు, లంతాపుట్టు ప్రాంతాల నుంచి వ్యాపారులు వ్యాన్ల నిండా పుచ్చకాయలను తీసుకువచ్చారు. ఎండల ప్రభావం వల్ల మధ్యాహ్నం అయ్యేసరికి ఈ కాయలన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. కాయ సైజును బట్టి ఒక్కో పుచ్చకాయ ధర రూ.60 నుంచి రూ. 100 వరకు పలికింది. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎండల ధాటికి తట్టుకునేందుకు వినియోగదారులు ధరను లెక్కచేయకుండా వీటిని కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement