వేడెక్కుతున్న అరకువేలీ
● 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు తీవ్రత కొనసాగుతోంది. శనివారం అరకువేలీలో 12.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అదికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 15.5 డిగ్రీలు, చింతపల్లిలో 16.5 డిగ్రీలు, జి.మాడుగులలో 17.1 డిగ్రీలు, అనంతగరిలో 18.8 డిగ్రీలు, కొయ్యూరులో 18.9 డిగ్రీలు నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు.


