జిల్లాలో 86.94శాతంపింఛన్ల పంపిణీ
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలోని అర్హులందరికీ ఇంటి వద్దే సామాజిక పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. మండలంలోని ఆదివాసీ గ్రామమైన మోదాపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఇళ్లవద్దకు వెళ్లి ఆయన పింఛనుదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీని పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. జిల్లాలో తొలిరోజు 86.94 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మురళీ, పలుఽశాఖల అధికారులు పాల్గొన్నారు.


