ఎస్పీ సంపర్క్‌కు 10 మంది పోలీసులు వినతి | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ సంపర్క్‌కు 10 మంది పోలీసులు వినతి

Feb 28 2026 7:24 AM | Updated on Feb 28 2026 7:24 AM

ఎస్పీ సంపర్క్‌కు 10 మంది పోలీసులు వినతి

ఎస్పీ సంపర్క్‌కు 10 మంది పోలీసులు వినతి

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు నుంచి కానిస్టేబుల్‌ వరకూ శుక్రవారం ఎస్పీ సంపర్క్‌ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది సెల్‌ నంబర్‌.9346912011 నంబరకు 10 మంది పోలీస్‌ సిబ్బంది ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావుకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 10 మంది పోలీసులు వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలు తెలియజేయడం జరిగిందన్నారు. సిబ్బంది సర్వీస్‌ పరమైన పోస్టింగ్స్‌, బదిలీలు, సెలవులు విషయంలో మాట్లాడడం జరిగిందన్నారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు 10 మంది పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో తిలక్‌బాబు, సూపరింటెండెంట్‌లు గిరి, బీమాబాయి, ప్రేయర్‌ సన్‌, ఎస్‌ఐ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement