గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామైన కొప్పాక బ్రిడ్జి సమీపంలో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్ కుమార్ తెలిపారు. కొప్పాక గ్రామ ఇన్‌చార్జ్ వీఆర్వో యాదల అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సుమారు 5 నుంచి 7 రోజుల క్రితం మృతిచెంది ఉంటాడని, మృతుడు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, శరీరంబాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖనం చేసినట్టు సీఐ చెప్పారు.


