గూడెంకొత్తవీధిలో విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

గూడెంకొత్తవీధిలో విస్తృత తనిఖీలు

Feb 26 2026 8:26 AM | Updated on Feb 26 2026 8:26 AM

గూడెంకొత్తవీధిలో విస్తృత తనిఖీలు

గూడెంకొత్తవీధిలో విస్తృత తనిఖీలు

మహిళతో మాట్లాడుతున్న పోలీసులు

గూడెంకొత్తవీధి: మండల కేంద్రమైన గూడెంకొత్తవీధిలో బుధవారం ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఇతర ప్రాంతాలకు చెందిన ద్విచక్ర వాహనాలను నిలిపి, వాటి వివరాలను సేకరించారు.తనిఖీల్లో భాగంగా పోలీసులు కొన్ని గృహాలను సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.గంజాయి సాగు చేసినా.. రవాణాకు సహకరించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, జీవితమంతా జైలు పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement