●శ్వేతవర్ణపు అద్భుతం
శీతాకాలం వీడ్కోలు పలికినా...
మన్యం గుండెల్లో ఆ మంచు వణుకు ఇంకా తగ్గలేదు! బుధవారం ఉదయం పాడేరు సరికొత్త లోకాన్ని తలపించింది. ఆ మంచు తెరల వెనుక... పది గంటలు దాటినా భానుడు పరదా చాటునే ఉండిపోయాడు.. తెల్లని
పాలకడలిలా పరుచుకున్న ఆ పొగమంచులో...
పాడేరు కనుమలు కరిగిపోయాయా అన్నట్లు కనిపించింది.
ప్రయాణం... ఒక అన్వేషణ!
జి.మాడుగుల, పెదబయలు, అరకు రహదారులన్నీ శ్వేత వర్ణపు మంచు పరదాలతో నిండిపోయాయి. దారులు కనిపించక, దిశలు తెలియక... వాహనాల లైట్లు వెలుగుతున్నా,
ప్రకృతి వేసిన మంచు ముసుగును దాటలేక
ప్రయాణికుడు పడుతున్న తపన వర్ణనాతీతం!
– సాక్షి, పాడేరు


