జిల్లా రిజిస్ట్రార్‌గా నరసింహమూర్తి బాధ్యతల స్వీకరణ
జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన నరసింహమూర్తిని అభినందిస్తున్న ఉద్యోగులు
సాక్షి,పాడేరు: జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్.నరసింహమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నక్కపల్లిలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తికి ప్రభుత్వం రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి, అల్లూరి జిల్లాకు నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రిజిస్ట్రార్‌ను వివిధ విభాగాల ఉద్యోగులు కాళ్ల రమేష్, ఉపేంద్ర, ఉమాశంకర్, ప్రసాద్‌తో పాటు ఈ–స్టాంప్ వెండర్లు కోటి, గోపి, రామచంద్రరావులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.


