ఈ–ఆటోలు ప్రారంభం
ఈ–ఆటోలను ప్రారంభిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్
సాక్షి,పాడేరు: ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు మంజూరైన నాలుగు ఈ–ఆటోల సేవలను శుక్రవారం అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ ఐటీడీఏ ఆవరణలో ప్రారంభించారు. 25 ట్రైసైకిళ్లు, ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా డీపీవో చంద్రశేఖర్ తెలిపారు. ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పి.ఎస్.కుమార్, డీఎల్‌డీవో జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


