పరీక్ష కాలం..
● ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు
● పకడ్బందీగా వంద రోజుల కార్యాచరణ అమలు
● రోజు వారీ పరీక్షలు
సాక్షి,పాడేరు: జిల్లాలో ఈ ఏడాది టెన్త్‌లో నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయ వర్గాలు బోధనతో శ్రమిస్తున్నాయి. అధిక మార్కులతో సత్తా చాటాలని టెన్త్ విద్యార్థులంతా కఠోర దీక్షతో చదువుల్లో నిమగ్నమయ్యారు. నూరుశాతం ఫలితాల సాధన లక్ష్యంగా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 159 పాఠశాలలకు చెందిన 7,299మంది రెగ్యులర్ విద్యార్థులు, 505 మంది ప్రైవేట్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ఉన్నత పాఠశాలల్లో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.అన్ని సబ్జెక్ట్‌లలో విద్యార్థులు పూర్తి పట్టు సాధించే ప్రత్యేక బోధన కార్యక్రమాలను అమలుజేస్తున్నారు. చేతిరాతపై కూడా విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు.


